వచ్చే ఏడాదినుండి మహిళల క్రికెట్‌ టోర్నీలు: కవిత

- January 23, 2017 , by Maagulf
వచ్చే ఏడాదినుండి మహిళల క్రికెట్‌ టోర్నీలు: కవిత

వచ్చే ఏడాది నుంచి మహిళల క్రికెట్‌ టోర్నీ నిర్వహిస్తామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్‌ ఎంపీ కవిత వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నీలో ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తుది పోరులో హైదరాబాద్‌పై విజయం సాధించిన జడ్చర్ల జట్టును ఆమె అభినందించారు.అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోందన్నారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి అవసరమైన వసతుల్ని పెంచనున్నట్టు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com