'సింగం-3' చిత్రం విడుదల వాయిదా--నిర్మాత శివకుమార్
- January 23, 2017
సూర్య నటించిన 'సింగం-3' చిత్రం మరోసారి వాయిదా పడింది. జనవరి 26న సినిమాను రిలీజ్ చేయాలని అంతా సిద్ధం అయిన వేళ తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంతో ఇది సినిమా విడుదలకు సరైన సమయం కాదని భావించిన నిర్మాతలు సినిమా విడుదలను నిలిపి వేసారు. వాస్తవానికి 'సింగం 3' చిత్రం గతేడాది డిసెంబర్ మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే తమిళనాడులో తుఫాన్ ఎఫెక్టుతో సినిమా విడుదల నిలిపేసారు. తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం కూడా సినిమా విడుదలను మరోసారి వాయిదా పడేలా చేసింది.పరిస్థితి సద్దుమనిగింది అనుకుంటున్న వేళ 'జల్లికట్టు' ఉద్యమం రూపంలో సినిమాకు ఆటంకం ఏర్పడింది. సూర్య , శ్రుతిహసన్, అనుష్కలు జంటగా నటిస్తున్న చిత్రం "S3-యముడు-3". ఈ చిత్రానికి హరి దర్శకుడు. ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సగర్వంగా సమర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. తమిళ, తెలుగు బాషల్లో ఈనెల 26 న విడుదల కావలసిన "S3-యముడు-3 చిత్రం విడుదల వాయిదా వేశాము. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంగా విడుదల చేయటానికి ప్లాన్ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం జల్లికట్టు నేపధ్యంలో తమిళనాట కొనసాగుతున్న పరిస్థితుల్ని గమనించి, ఇది విడుదలకి సరియైన సమయం కాదని తలచి ఈ నిర్ణయం తీసుకొవటం జరిగింది అన్నారు. డైరక్టర్ హరి , సూర్య కాంబినేషన్ లో వచ్చే చిత్రం కొసం తమిళ, తెలుగు ప్రేక్షుకులు ఏ విధంగా ఎదురుచూస్తుంటారో అందరికి తెలుసు.. కాని పలు కారణాల వలన ఈ చిత్రం విడుదలని ఏప్పటికప్పడు వాయిదా వేసుకుంటూ వస్తున్నాం. రెండు రాష్ట్రాల్లో అన్ని పరిస్థితులు అనుకూలంగా వున్న టైంలో చిత్రాన్ని విడుదల చేస్తాం.మా తదుపరి విడుదల తేది ని అతిత్వరలో తెలియజేస్తాం అని నిర్మాత తెలిపారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









