నాలుగు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఉత్తర్వులు...

- January 23, 2017 , by Maagulf
నాలుగు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఉత్తర్వులు...

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో నాలుగు మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. కొత్తగా నిర్మించే నాలుగు ఆస్పత్రులకు సంబంధించి సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 500 పడకల సామర్థ్యం కలిగిన వీటిని నగరంలో నాలుగు ప్రాంతాల్లో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్బీనగర్‌ విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌, రాజేంద్రనగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లి, పేట్‌బషీర్‌బాగ్‌, మియాపూర్‌లో వీటిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అంచనాలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com