కువైట్‌ నుంచి పక్షుల దిగుమతిపై బహ్రెయిన్‌ నిషేదం..

- January 24, 2017 , by Maagulf
కువైట్‌ నుంచి పక్షుల దిగుమతిపై బహ్రెయిన్‌ నిషేదం..

బర్డ్‌ ఫ్లూ భయాందోళనల నేపథ్యంలో బహ్రెయిన్‌, కువైట్‌ నుంచి వచ్చే వివిధ రకాలైన పక్షులను దిగుమతి చేసుకోవడంపై బ్యాన్‌ విధించింది. మినిస్ట్రీ ఆఫ్‌ వర్క్స్‌, మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ అండ్‌ అర్బన్‌ ప్లానింగ్‌ - అగ్రికల్చరల్‌ ఎఫైర్స్‌ మరియు మెరైన్‌ రీసోర్సెస్‌ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. అన్ని ఎంట్రీ పాయింట్స్‌ వద్దా స్టేట్‌ ఆఫ్‌ ఎమర్జన్సీని విధించారు. దేశంలోని అన్ని ఫామ్స్‌, పౌల్ట్రీ ఇండస్ట్రీస్‌లలో తనిఖీలు నిర్వహించడానికి ఆదేశాలు చేశామని అగ్రికల్చర్‌ మరియు మెరైన్‌ రిసోర్సెస్‌ అండర్‌ సెక్రెటరీ షేక్‌ ఖలీఫా బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా చెప్పారు. బహ్రెయిన్‌ బర్డ్‌ ఫ్లూ నుంచి పూర్తి క్షేమంగా ఉందని, పక్షుల పెంపకందార్లకు ఏమైనా అనుమనాలు కలిగితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారమివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కువైట్‌లో బర్డ్‌ ఫ్లూ కారణంగా 285 పక్షులు మృతి చెందినట్లు ఓఐఇ - వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ యానిమల్‌ హెల్త్‌ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com