రిపబ్లిక్‌ డే ఆఫర్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌లో...

- January 26, 2017 , by Maagulf
రిపబ్లిక్‌ డే ఆఫర్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌లో...

న్యూదిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ 'రిపబ్లిక్‌డే సేల్‌' ఆఫర్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగారూ.999లకే దేశీయ ప్రయాణాలను అందజేయనున్నట్లు వెల్లడించింది. దీనిని బుక్‌ చేసుకోవాలనుకునే వారి ప్రయాణాలు ఫిబ్రవరి 9, 2017 నాటి నుంచి ఉండాలని షరతు విధించింది. ఈ ఆఫర్‌ బుకింగ్‌లు జనవరి 25 నుంచి జనవరి 29 మధ్యలో జరిగి ఉండాలి. ప్రయాణానికి కచ్చితంగా 15రోజుల ముందేగా టిక్కెట్లు తీసుకోవాలని పేర్కొంది. ఈ ఆఫర్‌ కింద అందుబాటులో ఉన్న టిక్కెట్ల సంఖ్యను మాత్రం జెట్‌ఎయిర్‌వేస్‌ వెల్లడించలేదు. తొలుత బుక్‌ చేసుకున్న వారికి అధిక ప్రాధాన్యమని ఒక ప్రకటనలో తెలిపింది.
రిపబ్లిక్‌ డే సేల్‌ ఆఫర్‌ కింద అంతర్జాతీయ ప్రయాణాల ప్రీమియర్‌, ఎకానమీ క్లాస్‌ రిటర్న్‌ టిక్కెట్లలో జెట్‌ ఎయిర్‌వేస్‌ 30శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ టిక్కెట్లను జనవరి 25 నుంచి జనవరి 27లోపు బుక్‌ చేసుకోవాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com