జాకీచాన్ తాజా చిత్రం 'కుంగ్ ఫూ యోగా' తెలుగులో...
- January 26, 2017
యాక్షన్ హీరో జాకీచాన్ తాజా చిత్రం 'కుంగ్ ఫూ యోగా'ను కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సోనూ సూద్, దిశ పటాని, అమైరా దస్తూర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ 'జాకీచాన్ చిత్రాలను అందరూ ఇష్టపడతారు. గతంలో వచ్చిన ఆయన చిత్రాలు ఎంత ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'కుంగ్ ఫూ యోగా' చిత్రంతో మరోసారి అందర్నీ ఎంటర్టైన చేయడానికి వస్తున్నారు జాకీచాన. స్టాన్లీ టాంగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన ఎంటర్టైనర్లో బాలీవుడ్ నటీనటులు కూడా నటించడం విశేషం. గతంలో జాకీచాన్, స్టానలీ టాంగ్ కాంబినేషన్లో రూపొందిన 'రంబుల్ ఇన్ ది బ్రాంక్స్', 'ది మిత', 'చైనీస్ జోడియాక్' వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించాయి.
మళ్లీ వీరిద్దరి కాంబినేషనలో వస్తోన్న 'కుంగ్ ఫూ యోగా' చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. జాకీచాన్ మార్క్ యాక్షన్ కామెడీ సహా ఎన్నో ఫ్రెష్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. జాకీచాన్, ఆరిఫ్ లీ, లే జాంగ్ పాల్గొన్న కార్ ఛేజ్ సినిమాకి పెద్ద హైలైట్ అవుతుంది. అలాగే సినిమాలో ఉన్న రకరకాల జంతువులు పిల్లల్ని అమితంగా ఆకట్టుకొంటాయి.
ఫిబ్రవరి 3న సినిమాను విడుదల చేస్తున్నాం' అని తెలిపారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









