సామాజిక బాధ్యతగా నిర్వాసిత కార్మికులకు నియామకాన్ని క్రమబద్ధీకరణ
- January 27, 2017
మస్కట్:నిర్వాసిత కార్మికులకు ఇక ఉద్యోగాలు హుళక్కే అని చూచాయిగా అర్ధమవుతుంది. వారి నియామక క్రమబద్ధీకరణ చేయడం సామాజిక బాధ్యతగా అది అన్ని రంగాల్లో అమలుపర్చాలని ఒమన్ ఉప ప్రధాన మంత్రి తేల్చి చెప్పారు. నిర్వాసిత కార్మికుల నియామక క్రమబద్ధీకరణ పై దృష్టి కేంద్రీకరించి వారి పెరుగుదల ఆపటం ఒక సామూహిక బాధ్యత అని అన్నారు. దేశంలోని అన్ని రంగాలలో ఈ విజయం కోసం కృషి చేస్తున్నారు," మంత్రిమండలి వ్యవహారాల మండలి ఒమన్ ఉప ప్రధాన మంత్రి సయ్యిద్ ఫాహ్డ్ బిన్ మహమౌద్ అల్ సయిద్, మంత్రులు సమావేశంలో మంగళవారంచెప్పారు. ఉద్యోగానికి అనుభవం ముఖ్యం కాదని పేర్కొంటూ , శిక్షణ ద్వారా పొందిన అనుభవాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని ఆయన సూచించారు, పని కల్పించడమే కంపినీల ప్రధాన బాధ్యత అని మా ఒమాన్ యువత సామర్థ్యాన్ని ప్రశ్నించాడానికి మేము అనుమతించమని అల్ సెడ్ చెప్పారు.ఒమాన్ ప్రభుత్వం పలు రంగాల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు పనిచేస్తున్నట్లు అయన చెప్పారు. ప్రభుత్వం, ప్రైవేట్ రంగం మద్దతుతో జాతీయ ఆర్ధిక విస్తరించాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2016 సంవత్సరం చివరి నాటికి ఒమాన్ ఉద్యోగార్ధుల సంఖ్య 43.858 మంది తెలియచేస్తూ, వీరిలో 15.831 పురుషులు మరియు 28.027 స్రీలు ఉన్నారని పేర్కొంటూ, వీరిలో అత్యధికులు 25 ఏళ్ళ నుంచి 29 ఏళ్ళ మధ్య వయస్కులని అన్నారు. గణాంకాలు మరియు సమాచార జాతీయ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం, ఉద్యోగార్ధులకు అత్యధిక సంఖ్యలో విశ్వవిద్యాలయ డిగ్రీ హోల్డర్లుగా ఉన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







