దిర్హామ్‌కి ముందు యూఏఈలో రూపాయి చెలామణీ
- January 27, 2017
ఇప్పుడు చాలామందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, యూఏఈలో దిర్హామ్ అనేది రాకముందు, కరెన్సీగా గల్ఫ్ రుపాయిని వినియోగించేవారు. ఇది చమురు కథకి ముందు విషయమని నుమిస్‌బింగ్ ఫౌండర్ రామ్‌కుమార్ చెప్పారు. దిర్హామ్ పుట్టుకకి ముందు పలు రకాలైన కరెన్సీలను వినియోగించేవాళ్ళని ఆయన వివరించారు. బ్రిటిష్‌తో ఒప్పందాల కాలంలో ట్రుసియల్ స్టేట్స్, తమకు దగ్గరలో ఉన్న పెద్ద దేశాల కరెన్సీని వినియోగించేవారు. బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియా తదితర దేశాలకు చెందిన కరెన్సీని అప్పట్లో వినియోగించేవారు. ట్రుసియల్ స్టేట్స్‌లో 1957 వరకు ఇండియన్ కరెన్సీని వాడేవారు. 1957లో ఎక్సటర్నల్ రుపీస్ లేదా గల్ఫ్ రుపీస్ పేరుతో కొత్త నోట్లు ఇండియాలో ప్రింట్ అయ్యాయి. ఇవి గల్ఫ్ దేశాల్లో వినియోగం కోసం ప్రింట్ చేసేవారు. డిజైన్ ఒకేలా ఉన్నా, కలర్ మార్పుతో వీటిని రూపొందించేవారు. ఇండియాతో వాడే నోట్లతో వేరుగా ఉండేందుకుగాను జెడ్ అనే అక్షరాన్ని వీటి కోసం వినియోగించేవారు. 1, 10, 100 రూపాయల డినామినేషన్‌లో వీటిని వినియోగించేవారని రామ్‌కుమార్ చెప్పారు. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్ వంటి దేశాలు కూడా వీటిని చెలామణీ చేసేవి. 1957 నుంచి 1966 వరకు గల్ఫ్ రుపీస్ సర్క్యులేషన్‌లో ఉండేవి. 1966 నుంచి 1973 వరకు ట్రుసియల్ స్టేట్స్ ఖతార్ దుబాయ్ రియాల్‌ని వినియోగంలోకి తెచ్చాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







