ఒమాన్ రోడ్డు ప్రమాదాల్లో తగ్గుదల
- January 27, 2017
మస్కట్: ఒమన్‌లో ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. అలాగే ప్రమాదాల కారణంగా సంభవించే మరణాలు, గాయాల బారిన పడ్డ సందర్భాలు కూడా తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్‌స అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ట్రాఫిక్ సేఫ్టీ సెమినార్‌లో ఈ విషయాల్ని అధికారులు వెల్లడించారు. రాయల్ ఒమన్ పోలీసులు, రోడ్డు సేఫ్టీకి సంబంధించి తీసుకుంటున్న చర్యలు ఫలితాలను ఇస్తున్నట్లు తెలిపారు. గడచిన మూడేళ్ళలో ప్రమాదాల సంఖ్య తగ్గడం ఆహ్వానించదగ్గ విషయం. ఈ తగ్గుదల 50శాతంగా ఉంది ప్రమాదాలకు సంబంధించి. పలు సంస్థలతో కలిసి రోడ్ సేఫ్టీపై నిర్వహిస్తున్న అవగాహనా కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తుండడంతో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు విరివిగా చేపట్టాలని రాయల్ ఒమన్ పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









