వంకాయ, రొయ్యలు చింత చిగురుతో...
- January 30, 2017
కావలసిన పదార్థాలు: వంకాయలు - 250గ్రా, ఎండు రొయ్యలు - 100గ్రా, చింతచిగురు - 50గ్రా, ఉల్లిపాయ - ఒకటి, కరివేపాకు - రెండు రెబ్బలు, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూను, ధనియాల పొడి - ఒక టేబుల్ స్పూను, గరం మసాలా పొడి - పావు టీస్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీస్పూను, నూనె - నాలుగు టీస్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: చెంచాడు నూనెలో ఎండు రొయ్యలు దోరగా వేగించి పక్కన పెట్టుకోవాలి. వంకాయలను ముక్కలుగా తరిగి రంగు మారకుండా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగించిన తర్వాత అందులో పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, కారం వేసి కొద్దిగా వేగాక వంకాయ ముక్కలు, చింతచిగురు, ధనియాల పొడి వేసి మూత పెట్టాలి. కాసేపయ్యాక మసాలా పొడి, వేగించి పెట్టుకున్న రొయ్యలు వేసి నీళ్ళు పోసి ఇంకొంచెంసేపు ఉడికించి దింపుకోవాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







