వైఫై వలన కలిగే ఆరోగ్య ప్రమాదాలు...

వైఫై వలన కలిగే ఆరోగ్య ప్రమాదాలు...

ఎలక్ట్రోమాగ్నటిక్ హైపర్ సెన్సిటివిటీ (EHS)
ఎలక్ట్రోమాగ్నటిక్ హైపర్ సెన్సిటివిటీ లేదా EHS అనే ఎలక్ట్రోమాగ్నటిక్ కిరణాలు మనలో చాలా రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. "వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్" వారు తెలిపిన దాని ప్రకారం, మైకం, డోకులు, హార్ట్ పాల్పిటేషణ్, జలదరింపు, చర్మం ఎర్రగా మారటం లేదా చర్మం మండినట్టుగా అనిపించటం వంటివి వీటి వలన కలిగే ఆరోగ్య నష్టాలకు బహిర్గత లక్షణాలు. 
కేన్సర్ వ్యాధికి కారణం అవవచ్చు
2011 లో "వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్" తీసుకున్న నిర్ణయం ప్రకారం, Wi-Fi గాడ్జెట్ల మరియు ఇతర డివైస్ ల నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ కారణంగా మనుషులలో కేన్సర్ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది.
మానసిక రుగ్మతలు
Wi-Fi వాతావరణంలో పెరిగే పిల్లలు మానసిక (బ్రెయిన్) రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. తల్లిదండ్రులు వారి పిల్లలకు Wi-Fi గాడ్జెట్ లను ఉపయోగించకుండా ఉండేలా చూడాలి లేదా ఎక్కువ సమయం వాటి వాడకానికి దూరంగా ఉంచాలి. ఈ ప్రమాదకర కిరణాల వలన ఆరోగ్యానికి కలిగే ప్రమాదాల గురించి మీ పిల్లలలో అవగాహన కల్పించండి.
నిద్రలేమి
తరచుగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను వాడే వారి నిద్రలేమికి లోనవుతారు. దీర్ఘకాలిక సమయం పాటూ, Wi-Fi వాడే వారు రాత్రి సమయం నిద్ర పోవటంలో సమస్యలు ఎదుర్కొంటారు. డిప్రెషన్ పెరగటం మరియు హైపర్ టెన్షన్ వంటివి కూడా నిద్రలేమికి కారణం అవుతాయి.
వ్యక్తుల మధ్య సంబంధాలు చెదిరిపోవచ్చు
అభివృద్ధి చెందిన సాంకేతికత వలన మన మధ్య కమ్యూనికేషన్ లో నూతన పద్దతి ఆవిష్కరించబడింది. దీని వలన మధ్య నేరుగా కాకుండా పరికరాల ద్వారా మన మధ్య సంబాషణలకు కారణం అవుతుంది. ఫలితంగా మనుషుల మధ్య సంబంధాల పతనానికి కారణం అవుతుంది.

 

Back to Top