ఐటీ సోదాలు నితిన్ ఇంట్లో...
- January 31, 2017
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఫ్యామిలీపై ఐటీ డేగకన్ను వేసింది. నితిన్, ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి ఇళ్లపై ఆదాయపు పన్ను అధికారులు రైడ్స్ చేశారు. మంగళవారం ఉదయం ఐటీ టీమ్స్ జూబ్లీహిల్స్‌లోని నితిన్, సుధాకర్‌రెడ్డి ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇటీవల రిలీజైన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా నైజాం రైట్స్‌ని సుధాకర్ రెడ్డి కొనుగోలు చేశారు.
శాతకర్ణికి సంబంధించిన జమా ఖర్చులపై వివరాల సేకరణకే ఈ సోదాలు జరిగినట్టు ఇన్సైడ్ సమాచారం. టాలీవుడ్లో లీడింగ్ ప్రొడ్యూసర్, డిస్ర్టిబ్యూటర్‌గా చెలామణి అవుతున్న సుధాకర్‌రెడ్డి, గ్లోబల్ ఫిల్మ్స్, ఏషియన్ సినిమాస్ లాంటి డిస్ర్టిబ్యూషన్ కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టాడు.
మరోవైపు నితిన్‌తోపాటు శాతకర్ణి మేకర్స్ ఇళ్లలోనూ ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో శాతకర్ణి మూవీని నిర్మించిన మేకర్స్, ఎంత వసూళ్లు సాధించిందన్న విషయాన్ని ఎక్కడ ప్రకటించలేదు. దీంతో కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హంగామా చేశాయి. ఈ క్రమంలోనే ఐటీ అధికారులకు అనుమానం వచ్చి దాడులు చేసినట్టు ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తున్నమాట.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









