ఖలీఫా సిటీలో వీధుల్లో తిరుగుతూ ఓ సింహం పిల్ల...
- February 01, 2017
అబూధాబీ: " సింహం వంటి... చిన్నోడు వేటకొచ్చాడూ.. అడవి లాంటి అందాలు ఆక్రమించాడు ..అక్కడేదో పట్టి..ఇక్కడేదో లాగి " అంటూ వీధుల్లో తిరుగుతూ ఓ సింహం పిల్ల మంగళవారం హలచల్ చేసింది.సాధారణంగా సఫారీ లో ఈ తరహా పెద్ద పిల్లులను వాహనం లో తిరుగుతూ చూస్తాం. కానీ, ఖలీఫా నగర నివాసితులు అడవిలో మాదిరిగా తమ వీధుల్లో దర్జా ఒలకపోస్తూ పచార్లు చేస్తున్న బుల్లి మృగరాజుని చూసి ఆశ్చర్యపోయారు. ఖలీఫా నగరంలోని పలు బంగాళాల ముందు వాకిలిలో వీధుల్లో ఒక సింహం పిల్ల సంచరిస్తున్నట్లు నివాసితులు నివేదించారు. విస్మయం ఆందోళన కల్గించే ఈ విషయాన్ని సాక్ష్యాలతో సహా అవి ప్రమాదకరమైన పరిస్థితిని ఇతరులను హెచ్చరిస్తు సోషల్ మీడియా పోస్ట్లులు వెల్లువెత్తాయి.దక్షిణాఫ్రికా చెందిన హెయిన్ బోథా మాట్లాడుతూ, నా స్నేహితుడు నుండి నాకు ఫోన్ కాల్ వచ్చింది..తాను ఇంటికి డ్రైవింగ్ చేసుకొంటూ వెళుతున్న సమయంలో ఒక వీధిలో సింహం చూసినట్లు చెప్పాడు. . "నేను అక్కడికి వచ్చి చూసే సమయానికి, సింహం రహదారి దాటుతూ తానూ నివసిస్తున్న బంగాళా వద్దకు వెళ్లడం చూసినట్లు పేర్కొన్నారు.యుఎఇ లో పెంపుడు జంతువులు అన్యదేశ క్రూర మృగాలను పెంచుకోవడం స్వాధీన సమాఖ్య చట్టం యొక్క ప్రత్యక్ష ఉల్లంఘన నేరస్థులకు ఆరునెలల జైలు లో 500,000 డి హెచ్ వరకు జరిమానా విధిస్తారు. సింహం పిల్లలు పెంచుకొంటున్న బంగాళా యజమాని పై పోలీసులకు ప్రత్యక్ష సాక్షులు ఫోన్ ద్వారా పిర్యాదు చేశారు. అబూధాబీ వైల్డ్లైఫ్ సెంటర్ లో మేనేజర్ రోనెల్ బరిసెల్లోస్ అందిన సమాచారం మేరకు మరుసటి రోజు అక్కడకు వెళ్ళినపుడు ఆమె తెలిపిన వివరాలు పోలీసులు ఇవ్వబడిన సమాధానం గందరగోళంగా ఉంది. మేము అక్కడ సంచరిస్తున్న సింహాలను బంధించాలని అక్కడకు వెళ్ళినపుడు అక్కడ ఉన్నవ్యక్తి సింహాలను దుబాయ్ కు పంపినట్లు మాకు చెప్పారని బరిసెల్లోస్ చెప్పారు. పోలీసుల కధనం ప్రకారం, విల్లా యజమాని అధికారులు వచ్చేముందే జంతువులను దుబాయ్ పంపినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









