హనీమూన్ కోసం దుబాయ్ వచ్చిన సౌదీ జంట సంబ్రమాశ్చర్యం...

- February 01, 2017 , by Maagulf
హనీమూన్ కోసం దుబాయ్ వచ్చిన సౌదీ జంట సంబ్రమాశ్చర్యం...

దుబాయ్: అతిధి ప్రముఖులు ఎవరైనా దేశంలోనికి  అడుగు పెడితే...ఘన స్వాగతాలు మామూలే , కానీ దేశంలోనికి అడుగుపెట్టిన పర్యాటకులను ఎదురెళ్లి వారికి సెలవు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఇమిగ్రేషన్ అధికారులు ఆహ్వానం పలకడం అరుదుగా జరుగుతుంది. కొత్తగా వివాహం చేసుకొన్న సౌదీ దంపతులు హనీమూన్ పర్యటన కోసం దుబాయ్ వస్తే, ఆ మర్యాదే వేరని నవ దంపతులు మురిసిపోతున్నారు. విమానం నుంచి కాలు కింద పెట్టడమే తరువాయి రెసిడెన్సీ మరియు విదేశీయ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ దుబాయ్ అధికారులే స్వయంగా బహుమతులు మరియు పువ్వులను ఇస్తూ స్వాగతిస్తున్నారు. ఈ అనూహ్య మర్యాదకు కొత్త దంపతులు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నారు.  వారి హనీమూన్ దుబాయ్ వస్తున్నట్లు తమ స్నేహితులకు పెట్టిన ఆ ట్వీట్ గమనించి ఆ జంట ఏ సమయానికి ..ఏ విమానంలో వస్తున్నారో తెల్సుకొని దుబాయ్ అధికారులు స్వయంగా స్వాగతం పలకడం ఎంతో మధురానుభూతిని మిగులుస్తుందని పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com