స్వల్పంగా పెరిగిన బంగారం ధర...

- February 01, 2017 , by Maagulf
స్వల్పంగా పెరిగిన బంగారం ధర...

ముంబయి: ఈరోజు కూడా బంగారం ధర పెరిగింది. నగల వ్యాపారుల నుంచి డిమాండ్‌ పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.29,750కి చేరింది. బంగారం ధర గత నాలుగు రోజులుగా పెరుగుతూనే ఉంది. జనవరి 28 నుంచి పది గ్రాముల బంగారం ధర రూ.600 పెరిగింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా పెరిగి కేజీ వెండి ధర రూ.42వేల మార్కును దాటిపోయింది. ఈరోజు కేజీ వెండి రూ. 300 పెరిగి రూ.42,200కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్‌ పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర పెరిగింది. సింగపూర్‌ మార్కెట్లో ఈరోజు ఔన్సు బంగారం ధర 0.59శాతం పెరిగి 1,208.50 డాలర్లుగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com