గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికలు
- February 04, 2017
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తొలిఘట్టం. గోవా, పంజాబ్లో పోలింగ్ ముగిసింది. ఉదయం ఆరు నుంచే ఓటర్లు బారులుతీరారు. ఎన్నికల సంఘం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. వెబ్-కాస్టింగ్ ద్వారా ఓటింగ్ పోలింగ్ ప్రక్రియను రికార్డు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. పంజాబ్లో బందోబస్తు కోసం 200 కంపెనీలకు చెందిన భద్రతా బలగాలను రంగంలోకి దించారు.
పంజాబ్లో 117 స్థానాలకు వెయ్యి 145 మంది పోటీ పడుతున్నారు. ఐదు ప్రాంతాల్లో తొలిసారిగా ఈ-బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఆత్మానగర్, తూర్పు లూథియానా, ఉత్తర లూథియానా, ఉత్తర అమృత్సర్, పశ్చిమ జలంధర్ ప్రాంతాల్లో ఈ-బ్యాలెట్ సిస్టమ్ ఉపయోగించారు. గోవాలో 40 స్థానాలకు 250మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. వీరిలో ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు ఉండడం విశేషం. మరోవైపు.. రక్షణమంత్రి మనోహర్ పారికర్ సామాన్య పౌరుడిగా క్యూలో నిల్చును ఓటేశారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







