హీరో-విలన్ గా రానున్న వెంకటేష్
- February 04, 2017
75వ చిత్రానికి దగ్గరౌతున్నారు వెంకటేష్. అప్పుడే ఈ చిత్రానికి దర్శకుడ్ని ఫిక్స్ చేశారు. గౌతమి పుత్ర శాతకర్ణితో అదరగొట్టిన క్రిష్ వెంకీ సినిమా చేయబోతున్నారు. క్రిష్ ఓ కథ వినిపించడం, దానికి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చక చక జరిగిపోయాయి.
అయితే ఇప్పుడీ సినిమాకి సంబధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ ఒకటి బయటికివచ్చింది. ఓ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో వెంకీ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఆ రెండు పాత్రల మధ్య చూపించే వైరుధ్యం మాత్రం కొత్తగా ఉండబోతోందని ఇన్ సైడ్ టాక్. ఓ పాత్రలో వెంకీ గెటప్ చూసి అంతా షాక్ అవ్వాల్సిందేనని అంటున్నారు.మరో పాత్రలో నెగిటీవ్ ఛాయలు కనిపిస్తాయని తెలుస్తోంది. ఈ కొత్తదనం నచ్చే వెంకీ క్రిష్ కథకు ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తుంది.
త్వరలోనే ఈ చిత్రానికి సంబధించిన ఓ ప్రకటన వచ్చే అవకాశం వుంది.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









