బీఎస్ఎన్ఎల్లో బంపర్ ఆఫర్...
- February 04, 2017
న్యూఢిల్లీ: జియో ఉచిత డేటాతో టెలికాం కంపెనీలన్నీ డేటా టారిఫ్ ధరల్ని గణనీయంగా తగ్గిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో బీఎస్ఎన్ఎల్ కూడా చేరిపోయింది. ప్రస్తుతం ఉన్న ధరకు మూడు రెట్లు తగ్గించి రూ.36కే 1 జీబీ డేటా అందిస్తోంది. నియోగదారులకు ప్రత్యేక ప్యాక్ కింద ఈ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది. టెలికాం రంగంలోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్ ప్యాక్ అని తెలిపింది. అంతేకాకుండా రూ.291 ప్లాన్లో డేటాను నాలుగు రెట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. 2 జీబీకి బదులు 8జీబీ డేటా, రూ.78 ప్లాన్లో డబుల్ డేటా(2జీబీ) అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇంటర్నెట్ మార్గెట్ పెంచుకోవడానికే ఈ ఆఫర్లు తీసుకొస్తున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







