'ఫేస్ బుక్' మరింత ఆకర్షనీయంగా రానుంది..!
- September 16, 2015
యూజర్ల కోరిక ఫేస్ బుక్ యాజమాన్యం తర్వలో సరికొత్త ఆప్షన్ ప్రవేశపెట్టనుంది. త్వరలో మీ ఫేస్ బుక్ పేజీలో డిజ్ లైక్ బటన్ అనే ఆప్షన్ చూడవచ్చు. ఫేస్ బుక్ యాజమన్యం ప్రస్తుతం డిజ్ లైక్ బటన్ ను యాడ్ చేసే పనిలో నిమగ్నమైంది. త్వరలోనే దీన్ని పరీక్షించనుంది. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాలిఫోర్నియాలోని మెన్లో పార్క్ లో జరిగిన సమావేశంలో జుకర్ బర్గ్ పాల్గొన్నారు. చాలామంది యూజర్లు డి జ్ లైక్ బటన్ ఆప్షన్ కావాలని అడుగుతున్నారని చెప్పారు. వారి కోరిక మేరకు ఈ ఆప్షన్ ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. త్వరలోనే అందుబాటులో ఉంచుతామని చెప్పారు. బాధాకరమైన విషయాలకు లైక్ బటన్ ను ప్రెస్ చేయడాన్ని చాలామంది ఇబ్బందిగా భావిస్తున్నారని అన్నారు. ఇది మంచిది కాదు అని చెప్పేందుకు సంస్థ ఓ మార్గం కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది అని జుకర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







