పీఏ వివాదం పై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలయ్య
- February 06, 2017
బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం నియోజకవర్గంలో ఆయన పీఏ శేఖర్ వివాదం రేకెత్తించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గం పరిధిలో టెండర్లలో షెడ్యూలు దాఖలు చేసిన అనంతపురం నగరానికి ఓ కాంట్రాక్టర్ను ఫోన్లో తీవ్ర స్థాయిలో బెదిరించిన ఆదారాలు దొరికాయి. ఇదే కాదు రెండున్నరేళ్ల నుంచి పీఏ శేఖర్ ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారని.. బాలకృష్ణ దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని స్వయంగా టీడీపీ వర్గాలు వాపోతున్నాయి.
దీనిపై బాలకృష్ణ స్పందించారు. శేఖర్ వివాదానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని, పార్టీకి నష్టం చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. తనకు నిమ్మకూరు ఎలాగో, హిందూపురం కూడా అంతేనని, హిందూపురం అనేది తన కుటుంబంతో సమానమని అన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







