పీఏ వివాదం పై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలయ్య

- February 06, 2017 , by Maagulf
పీఏ వివాదం పై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలయ్య

బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తోన్న హిందూపురం నియోజకవర్గంలో ఆయన పీఏ శేఖర్‌ వివాదం రేకెత్తించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గం పరిధిలో టెండర్లలో షెడ్యూలు దాఖలు చేసిన అనంతపురం నగరానికి ఓ కాంట్రాక్టర్‌ను ఫోన్‌లో తీవ్ర స్థాయిలో బెదిరించిన ఆదారాలు దొరికాయి. ఇదే కాదు రెండున్నరేళ్ల నుంచి పీఏ శేఖర్‌ ఇదే రీతిలో వ్యవహరిస్తున్నారని.. బాలకృష్ణ దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని స్వయంగా టీడీపీ వర్గాలు వాపోతున్నాయి.

దీనిపై బాలకృష్ణ స్పందించారు. శేఖర్ వివాదానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని, పార్టీకి నష్టం చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. తనకు నిమ్మకూరు ఎలాగో, హిందూపురం కూడా అంతేనని, హిందూపురం అనేది తన కుటుంబంతో సమానమని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com