మహేశ్, కొరటాల శివ కాంబినేషన్ రెండో సినిమా...
- February 07, 2017
మహేశ్, కొరటాల శివ కాంబినేషన్ రెండో సినిమాకు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఇద్దరి కలయికలో వచ్చిన 'శ్రీమంతుడు' మహేశ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా, టాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. కొత్త సినిమా కోసం కథా చర్చల కోసం ఆ ఇద్దరూ మలేసియాకు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. వారితో పాటు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సైతం ఉన్నారు. అక్కడ స్ర్కిప్టును ఓ కొలిక్కి తేవడంతో పాటు సంగీత చర్చలు కూడా నడుస్తున్నాయి. ప్రస్తుతం ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్న సినిమా చివరి షెడ్యూల్‌కు వచ్చింది. ఈ నెల 15 నుంచి పూణే, ముంబై, చెన్నై, హైదరాబాద్‌లలో మార్చి నెలాఖరు వరకు జరిగే షెడ్యూల్‌తో టాకీ పార్ట్ మొత్తం పూర్తి కానుంది.
మిగిలి ఉండే రెండు పాటల్ని మహేశ్, నాయిక రకుల్‌ప్రీత్‌పై విదేశాల్లో తీస్తారు. అనంతరం ఏప్రిల్ నుంచి కొరటాల శివ దర్శకత్వం వహించే సినిమా కోసం కాల్షీట్లు కేటాయించారు మహేశ్. ఇందులో నాయికగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో తాజా సంచలనం కీర్తి సురేశ్ పేరు కూడా ఒకటి.
మహేశ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తాడని ప్రచారం జరుగుతున్న ఈ చిత్రానికి డి.వి.వి. దానయ్య నిర్మాత.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







