ఇళయరాజా తన ఫ్యాన్స్ అందరికీ ఓ గుడ్ న్యూస్...

- February 07, 2017 , by Maagulf
ఇళయరాజా తన ఫ్యాన్స్ అందరికీ ఓ గుడ్ న్యూస్...

మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే మాంత్రికుడు ఇళయరాజా. దాదాపు అయిదు దశాబ్దాలుగా మ్యూజిక్ ఇస్తున్న ఈ లయ రాజు ఇప్పటికీ వెరైటీ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రముఖ హీరోలు, డైరెక్టర్లు కూడా ఆయన అభిమానులే. వైవిధ్యమైన చిత్రాలకు తన దైన శైలిలో అద్బుత సంగీతం అందించిన ఈ మ్యూజిక్ మాస్ట్రో శశికుమార్ హీరోగా తెరకెక్కిన తారై తర్పటై తో వెయ్యి సినిమాలకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఇళయరాజా తన ఫ్యాన్స్ అందరికీ ఓ గుడ్ న్యూస్ అందించాడు. 'మ్యూజిక్ మాస్ట్రో' పేరుతో కొత్తగా ఓ యాప్ రిలీజ్ చేశాడు. ఇళయరాజా హిట్స్ ను నాన్ స్టాప్ గా అందిస్తుంది ఈ యాప్. అండ్రాయిడ్, యాపిల్ యూజర్లు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఈ యాప్ ని డౌన్ లోడ్ చేసి ఇళయ రాజా ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని వింటూ హ్యపీగా ఎంజాయ్ చేయండి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com