13వేల మందిని ఉరితీశారు ఐదేళ్లలో...

- February 07, 2017 , by Maagulf
13వేల మందిని ఉరితీశారు ఐదేళ్లలో...

సిరియా ప్రభుత్వంపై ఆమ్నెస్టీ ఆరోపణ 
బీరుట్‌: సిరియా ప్రభుత్వం 2011 నుంచి 2015 మధ్య కాలంలో 13వేల మందిని ఉరి తీసిందంటూ అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఆవేదన వ్యక్తం చేసింది. డమాస్కస్‌లోని సైద్నాయా జైలులో ఈ సామూహిక ఉరితీతలు జరిగాయని నివేదికలో వెల్లడించింది. వారానికి కనీసం ఒక్కసారైనా యాభై వరకు ఖైదీలను జైలు గదుల్లోంచి నిరంకుశ విచారణలకు లాక్కువెళ్లేవారని.. చిత్రహింసలకు గురి చేసి ఉరి తీసేవారని తెలిపింది. ప్రక్రియ సాగినంతసేపు బాధితులకు కళ్లకు గంతులు కట్టేవారని.. మెడకు తాడు బిగిసేవరకూ ఎప్పుడు చనిపోతామన్నది వారికి తెలిసేది కాదని పేర్కొంది.
బాధితుల్లో ఎక్కువ మంది.. అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన సాధారణ పౌరులని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com