డ్యూటీలో వున్నప్పుడు మొబైల్ ఫోన్ నిషేధం
- February 09, 2017
మనామా: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, హెల్త్ సెక్టార్ ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. హెల్త్ మినిస్ట్రీ దీనికి సంబంధించి సర్క్యులర్‌ని తాజాగా జారీ చేసింది. ఉల్లంఘనులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొంది మినిస్ట్రీ. మొబైల్ కాల్స్‌తోపాటుగా, మొబైల్‌లో సోషల్ మీడియా వినియోగించడం కూడా ఉల్లంఘనగానే పరిగణిస్తారు. హెల్త్‌కేర్ రంగంలో మెరుగైన సేవలందించేందుకోసం ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని మినిస్ట్రీ భావిస్తోంది. సివిల్ సర్వీసెస్ బ్యూరో డెసిషన్ 22లో పేర్కొన్న విధంగా ఉల్లంఘనలకు జరీమానా విధించడం జరుగుతుంది. ఫిబ్రవరి ఆరున ప్రైమరీ కేర్ అండ్ పబ్లిక్ హెల్త్ యాక్టింగ్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ వలీద్ అల్ మానె సంతకంతో కూడిన ఈ సర్క్యులర్ విడుదలైంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







