చిలీలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు...భయాందోళనలో జనం

- September 17, 2015 , by Maagulf
చిలీలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు...భయాందోళనలో జనం

భారీ భూకంపం ఒకటి చిలీని వణికించేస్తోంది. రిక్టర్ స్టేల్‌పై 8.3గా నమోదయ్యింది. గురువారం జరిగిన ఈ సంఘటనతో జనం బెంబేలెత్తిపోయారు. అందరూ రోడ్లపైకి పరుగులు తీశారు. ఇదిలా ఉండగానే సునామీ హెచ్చరికలతో ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచని స్థితిలో ప్రాణాలరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రాజధాని శాండియాగోకు వాయువ్యం దిశలో 232 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. వాల్ పరైసో, పెరూ, హవలీ తీరప్రాంతాల్లో దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో 3 మీటర్ల కన్నా ఎత్తైన అలలతో కూడిన సునామీ చీలీ తీర ప్రాంతాన్నితాకే ప్రమాదముందని సునామీ హెచ్చరికల జారీ కేంద్రం హెచ్చరించింది. దీంతో ప్రజలు ఇళ్ళలో ఉండలేక బయటకు వెళ్లలేక నడి రోడ్లపైనే ఉంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com