వాట్సాప్‌లో తీవ్రవాదం: ఏడేళ్ళ జైలు ...
- February 09, 2017
జెడ్డా: రియాద్‌లోని ప్రత్యేక క్రిమినల్ న్యాయస్థానం ఓ వ్యక్తికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. డయీష్ తీవ్రవాద సంస్థకి మద్దతివ్వడం, ఆ సంస్థకి చెందిన అత్యున్నతస్థాయి వ్యక్తులతో సంబంధాలు కొనసాగించడం వంటి నేరాలకుగాను నిందితుడికి శిక్ష ఖరారయ్యింది. వాట్సాప్ ద్వారా డయీష్ సంస్థ ప్రముఖులతో సంబంధాల్ని నిందితుడు కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది. డయీష్లో చేరి నసిరియాకి వ్యతిరేకంగా టెర్రరిస్ట్ ఆపరేషన్ చేపట్టాలనుకుంటున్నట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు. డయీష్ సంస్థకి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగ్స్‌ని నిందితుడి మొబైల్ ఫోన్లో గుర్తించారు పోలీసులు. అరెస్ట్ అయినప్పటినుంచి ఏడేళ్ళపాటు నిందితుడికి జైలు శిక్షను విధించడం జరిగింది. శిక్ష పూర్తయ్యాక ఏడేళ్ళపాటు ట్రావెల్ బ్యాన్ కూడా అదనంగా విధించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







