ఎన్టీఆర్‌ కథానాయకుడుగా బాబీ దర్శకత్వంలో...

- February 09, 2017 , by Maagulf
ఎన్టీఆర్‌ కథానాయకుడుగా బాబీ దర్శకత్వంలో...

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కథానాయకుడుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. తారక్‌ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌ ఖాతా ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో తీసిన ఫొటోలను పోస్ట్‌ చేసింది.
ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తారక్‌ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న ఈ చిత్రం కోసం హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుడు వాన్స్‌ హార్ట్వెల్‌ పని చేస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన రాశీఖన్నా నటిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com