డొమెస్టిక్ వర్కర్స్‌పై చట్టానికి క్యాబినెట్ ఆమోదం...
- February 09, 2017
ఇ క్యాబినెట్, డొమెస్టిక్ వర్కర్లు అలాగే వారి స్పాన్సరర్లకు సంబంధించిన హక్కులు, బాధ్యతలపై ఓ చట్టాన్ని ఆమోదించింది. ఇరువురి మధ్యా సంబంధాల్ని రెగ్యులేట్ చేసేలా ఈ చట్టాన్ని రూపొందించారు. పేర్కొనబడ్డ నిబంధనలకు అనుగుణంగా స్పాన్సరర్ నుంచి సౌకర్యాలు డొమెస్టిక్ వర్కర్స్‌కి అందాల్సి ఉంటుంది. అలాగే తన బాధ్యతల్ని నిబంధనల్లో పేర్కొన్న విధంగా డొమెస్టిక్ వర్కర్ గుర్తించవలసి ఉంటుంది. డ్రైవర్లు, నానీలు, కుక్స్, గార్డెనర్స్ సహా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసేవారు కూడా డొమెస్టిక్ వర్కర్స్ కేటగిరీలోకి వస్తారు. వర్కర్ అలాగే స్పాన్సరర్ ఇద్దరూ సాధారణ వ్యక్తుల్లానే చట్టం పరిగణిస్తుంది. వర్కర్ తన స్పాన్సరర్ పర్యవేక్షణలో కాంట్రాక్ట్‌కి సంబంధించి పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా పని చేయవలసి ఉంటుంది. ఇప్పటిదాకా ఈ రంగంలో తలెత్తుతున్న వివాదాలకు చెక్ పెట్టేలా కొత్త చట్టం ఇరువురికీ రక్షణగా పనిచేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అక్రమంగా స్పాన్సరింగ్ చేయడం అలాగే అక్రమంగా పనికి కుదరడం వంటివి కొత్త చట్టం ద్వారా తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తారు. ఇకపై అలాంటివాటికి అకవాశం ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







