బాంగ్లాదేశ్ పై భారత్ రికార్డు స్కోరు
- February 10, 2017
హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతోంది. గురువారం టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ రెండో రోజు తన హవా కొనసాగించింది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకు (ప్రస్తుతం జరిగేది కూడా కలిపి) తొమ్మిది టెస్టు మ్యాచ్లు జరిగాయి. వీటిలో రెండు డ్రా కాగా, ఐదు మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. 2007 మేలో రెండు మ్యాచ్ల సిరీస్ కోసం భారత జట్టు బంగ్లాదేశ్లో పర్యటించింది. మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 610/3వద్ద డిక్లేర్ చేసింది.
ఇప్పటి వరకు బంగ్లాపై భారత్కు ఇదే అత్యధిక స్కోరు. తాజా టెస్టులో కోహ్లీ సారథ్యంలోని భారత్ జట్టు ఆ రికార్డును అధిగమించింది. 356/3పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు 166ఓవర్లకి ఆరు వికెట్ల నష్టానికి 687 పరుగులు చేసింది. భారత జట్టు సారథి విరాట్ బంగ్లాపై విరుచుకుపడ్డాడు. ద్విశతకం సాధించిన విరాట్ జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు.
దీంతో భారత జట్టు గత రికార్డును అధిగమించింది. 150వ ఓవర్లో ఇస్లాం వేసిన మూడో బంతిని ఎదుర్కొన్న సాహా ఒక పరుగు రాబట్టడంతో భారత స్కోరు 610కి చేరి గత రికార్డును సమం చేసింది. ఆ తర్వాత అదే ఓవర్లో ఐదో బంతిని ఎదుర్కొన్న జడేజా ఒక పరుగు రాబట్టడంతో భారత స్కోరు 611కి చేరింది. దీంతో బంగ్లాపై భారత్ పాత రికార్డు బద్దలై కొత్త రికార్డు నమోదైంది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







