హెచ్1బీ వీసాల సమస్యపై స్పందించిన ప్రభుత్వం..!
- February 10, 2017
హెచ్-1బీ వీసా సమస్యలు ఎదుర్కొంటున్న టెక్ ఉద్యోగులకు త్వరలోనే భారత్ పరిష్కారం చూపుతుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అమెరికా ప్రతినిధుల సభలో హెచ్-1బీ సంస్కరణ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఐటీ వర్గాలు ఎదుర్కొనే ఈ సమస్యలను పరిష్కరించేందుకు విదేశాంగ మంత్రిత్వశాఖతో కలిసి పనిచేస్తున్నామని వివరించారు. భారత్‌తో పాటు అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ కూడా ఇలాంటి సమస్యలు పరిష్కరించడంలో పూర్తి సహకారం అందజేస్తుందని ఆయన వెల్లడించారు. 'భారత ఐటీ కంపెనీలు అమెరికాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అవన్నీ అమెరికా ప్రభుత్వానికి దాదాపు 20 బిలియన్‌డాలర్ల వరకు పన్నుగా చెల్లిస్తున్నాయి. 4లక్షల మందికి పైగా అమెరికాలో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సమానంగా అత్యున్నత ప్రమాణాల సేవలను అందిస్తున్నాయి' అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే అన్నీ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







