మరింత కట్టుదిట్టంగా వాట్సాప్‌.!

- February 10, 2017 , by Maagulf
మరింత కట్టుదిట్టంగా వాట్సాప్‌.!

 ప్రముఖ మెసెంజర్‌ వాట్సాప్‌ తన వినియోగదారుల ఖాతాలకు మరింత భద్రత కల్పించేందుకు కొత్త భద్రతా విధానాన్ని తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, విండోస్‌ వినియోగదారులందరికీ రెండంచెల వెరిఫికేషన్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. అంతకుముందు చాలా కాలం పాటు దీన్ని బీటా వెర్షన్‌లో పరీక్షించిన ఆ సంస్థ ఎట్టకేలకు కొత్త ఆప్షన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన ఆప్షన్‌తో ఖాతాను మరింత పదిల పరుచుకోవచ్చు. తాజాగా తీసుకొచ్చిన ఫీచర్‌ ఆప్షనల్‌ మాత్రమే. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలని అనుకునేవారు వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోని అకౌంట్‌ సెట్టింగ్స్‌లోకి వెళితే 'టు-స్టెప్‌ వెరిఫికేషన్‌' ఆప్షన్‌ కనిపిస్తుంది.

అందులో ఆరు అంకెల పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ-మెయిల్‌ ఐడీని ఇవ్వాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్‌ మరిచిపోయినప్పుడు ఈ-మెయిల్‌ పనికొస్తుంది. అయితే, ఈ-మెయిల్‌ ఐడీని ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుందని, ఒకవేళ తప్పుడు ఐడీ ఇస్తే ఆ లింక్‌ వేరే వాళ్లకు వెళ్లే ప్రమాదముందని కంపెనీ పేర్కొంది. కాగా, తాజాగా తీసుకొచ్చిన ఫీచర్‌తో మీ అకౌంట్‌ను వేరేవాళ్లు వెరిఫై చేసే వీలుండదు. ఒక వేళ కొత్తగా ఫోన్‌ మార్చాలనుకునేటప్పుడు ఈ ఆరంకెల పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com