కోడిమాంస దిగుమతులను 16 దేశాలనుండి నిషేధించిన ఒమాన్
- February 13, 2017
మస్కట్:బర్డ్ ఫ్లూ కారణంగా కోడిమాంస ఉత్పత్తులని ఒమాన్ లో గత రెండు నెలల నుంచి పది యూరోపియన్ దేశాల నుంచి నిషేధించారు. ఆ దేశాలకు తోడు ఇప్పుడు జపాన్ , గ్రీస్, ఇటలీ, ఉగాండా, కువైట్ మరియు భారతదేశానికి చెందఁజిన గుజరాత్ , పంజాబ్, హర్యానా, కర్నాటక రాష్ట్రాలకు చెందిన పౌల్ట్రీ దిగుమతులపై నిషేధం విధించింది.వ్యవసాయం మరియు ఫిషరీస్ మంత్రిత్వశాఖకు చెందిన వ్యవసాయం మరియు మత్య్స శాఖ మంత్రి, శ్రీ శ్రీ డాక్టర్ ఫుడ్ బిన్ జాఫర్ బిన్ ముహమ్మద్ అల్ సజ్వని దిగుమతి నిషేధ నిర్ణయం జారీ చేస్తూ ఒక ప్రకటనలో చెప్పారు. ఈ నిషేధం పరిమితి ఫ్ తగ్గిందనే సంకేతం వచ్చేవరకుకొనసాగుతుంది. ఈ ఏడాది జనవరి మధ్యకాలంలో వ్యవసాయం మరియు ఫిషరీస్ మంత్రిత్వశాఖకు ఉక్రెయిన్, హంగేరి, బల్గేరియా, పోలాండ్, ఫిన్లాండ్, జపాన్ నుంచి పౌల్ట్రీ ఉత్పత్తులను దిగుమతి నిషేధం విధించింది.డిసెంబర్ లో జర్మనీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్వీడన్, పంజాబ్, హర్యానా, కర్నాటక, గుజరాత్ మిగిలిన భారతదేశ రాష్ట్రాలకు దిగుమతులు నిషేధించారు. విస్తరించిన అత్యంత వ్యాధికారక ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ వ్యాప్తి శరవేగంగా వ్యాప్తి చెందడంతో నవంబర్ 2016 నుంచి అనేక యూరోపియన్ దేశాలలో అలాగే అనేక ఆసియా దేశాలలో కోళ్లకు ఈ వ్యాధి ప్రబలుతున్నట్లు తెలియవచ్చింది. కువైట్ యానిమల్ హెల్త్ వరల్డ్ ఆర్గనైజేషన్ తెలిపిన వివరాల ప్రకారం, ఇది ఒక అత్యంత అంటు వైరల్ సంక్రమణం.
తాజా వార్తలు
- వెనిజులాలో భూకంపాల విధ్వంసం..మృతుల సంఖ్య 1,430కు చేరిక
- కరీంనగర్లో తొలి స్పేస్ ల్యాబ్ ప్రారంభించిన పారమిత హెరిటేజ్ పాఠశాల
- వాహనాల నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దు..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!







