భీగీ చునరియా - హోలీ 2017..
- February 15, 2017
రంగుల పండుగ హోలీ సందర్భంగా భీగీ చునరియా - హోలీ 2017 వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు హృతిక్ రోషన్, సోనూసూద్, విశాల్ శేఖర్, బాద్‌షా, నీతి మోహన్ తదితరులు డిజె హరీష్, డిజె బుద్ధా, డిజె పియర్ తదితరులు హాజరు కానున్నారు. యూఏఈలో నివసిస్తున్న 200 దేశాలకు చెందిన వారు ఈ వేడుకకి హాజరవుతారని అంచనా. ఈ వివరాల్ని తెలిపేందుకు జెడబ్ల్యు మారియాట్ మార్కిస్ హోటల్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. సోనూసూద్ సహా పలువురు ప్రముఖులు ఈ ప్రెస్‌మీట్‌కి హాజరయ్యారు. రెడ్ ఫ్లై ఈవెంట్స్, మార్చ్ 17న ఆటిజం రాక్స్ ఎరినా - దుబాయ్ ఔట్‌లెట్ మాల్ భీగీ చునరియా - హోలీ 2017 వేడుకలకు వేదిక కానుంది. ఈ వేడుకలో జాయ్ ఆఫ్ గివింగ్ అనేది ముఖ్యమైన ఎలిమెంట్ అని మిసెస్ సాధనా అగర్వాల్ చెప్పారు. రాకేష్ అగర్వాల్ మాట్లాడుతూ, ఇండియన్స్‌తోపాటు, వివిధ దేశాలకు చెందిన సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఈవెంట్‌ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెయిన్ మేకర్ ఈవెంట్ ఓనర్ దీపక్ మిర్చందానీ మాట్లాడుతూ, ఈ వేడుక ప్రపంచ వ్యాప్తంగా అందరూ చర్చించుకునేలా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.



తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







