అబుధాబీలో ఇళ్ళలో, వీధుల్లో జంతు వధ నిషేధం- 500 దీర్హమ్ ల జరిమానా
- September 18, 2015
ఈద్-అల్-అధా మొదటిరోజు ఈ నెల 24న జరుపుకుంటున్న సందర్భంగా, అబుధాబీ లోని జంతు వధ శాలలు తయారవుతున్నాయి. అబూ ధాబీ సిటీ మునిసిపాలిటీ (ADCM) - అనారోగ్య పరిస్థితులు మరియు పర్యావరణ సమస్యలకు దారితీసే విధంగా ఇళ్లల్లో, వీధులలో, కూడళ్లలో బలి ఇవ్వడాన్ని నిషేధించింది; ఈ నిబంధన అతిక్రమించిన వారికి 500 దీర్హమ్ ల జరిమానా మరియు సదరు జంతువు కూడా జప్తు చేయబడుతుందని కూడా హెచ్చరించింది. అధా మొదటి రోజున జంతువులను బలి ఇవ్వడానికి, అబుధాబీ సామాజిక జంతు వధ శాల, బనీయాస్ జంతు వధ శాల,అల్-శమామా జంతు వధ శాల,అల్-వాత్బా జంతు వధ శాలలు ఉదయం 7 నుండి, సాయంత్రం 6 వరకు; మిగిలిన రోజుల్లో ఉదయం 6 నుండి, సాయంత్రం 6 వరకు సిద్ధంగా ఉంటాయని ప్రజా ఆరోగ్య శాఖ డైరక్టర్ ఖలీఫా మొహమ్మద్ అల్ రుమైథీ తెలియజేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







