రాజధాని ఉద్యోగులకు తియ్యటి కబురు...
- February 15, 2017
రాజధాని ఉద్యోగులకు తియ్యటి కబురు . అతి తక్కువ ధరకే భూమి కేటాయించడంతో పాటు ఇళ్లు కట్టుకునేందుకు సహకారం అందించాలని ఏపి సర్కార్ డిసైడయింది. ఉద్యోగులతో పాటు ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వెంట్స్‌కు కూడా ఏపి ప్రభుత్వ గృహమస్తు దీవెనలు అందనున్నాయి. ఇదే జరిగితే రాజధానికి తరలివచ్చిన ఉద్యోగుల సొంతింటి కల నెరవేరినట్లే.. అమరావతిలో ప్రభుత్వ అధికారులు,ఉద్యోగులు,ప్రజాప్రతినిధులకు సొంత ఇళ్ల నిర్మాణంపై ఏపి ప్రభుత్వం దృష్టి పెట్టింది. అతి తక్కువ ధరకు ల్యాండ్ కేటాయించడంతో పాటు సొంతింటి కల నెరవేర్చుకునేందుకు హడ్కో రుణాలు ఇప్పించనుంది. వీటితో పాటు ప్రభుత్వ క్వార్టర్లు కూడా నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.
నవ్యాంధ్ర రాజధానికి తరలివచ్చిన సివిల్ సర్వెంట్ అధికారులు,ఉద్యోగులు సొంత ఇళ్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే క్వార్టర్లు కాకుండా వారి సొంత ఇంటికలను నెరవేర్చాలని డిసైడయ్యారు. రాజధాని పరిసర ప్రాంతాల్లోని 5 గ్రామాల్లో సుమారు 150 నుంచి 200ల ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. ఇందులో జీ ప్లస్ 8 విధానంలో అపార్ట్ మెంట్లు నిర్మించి ఇస్తారు. ఐదు కేటగిరీల్లో నిర్మించే అపార్ట్ మెంట్లలో మొదటి కేటగిరీలో జడ్జిలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ఉంటారు.రెండు, మూడు కేటగిరీల్లో గెజిటెడ్ అధికారులు, నాలుగో కేటగిరీలో ఎన్జీవోలు,ఐదో కేటగిరీలో క్లాస్ 4 ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది ఉంటారు. ఇక 900 నుంచి 2వేల 900 చదరపు అడుగుల్లో అపార్ట్మెంట్లు నిర్మించేలా ప్రణాళికలు సిద్దం చేసారు. ఇక ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చే క్వార్టర్లను సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో నిర్మించేందుకు ఏపి సర్కార్ ప్రణాళికలను డిసైడ్ చేసింది. అమరావతికి అందరూ ఖచ్చితంగా రావాల్సిందేనని ఏపి సర్కార్ పెట్టిన నిబంధనతో అందరూ తరలివచ్చారు. కానీ అదిరిపోయే అద్దెలతో జేబులు గుల్ల చేసుకున్నారు. ఈ తరుణంలో ఏపి సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







