బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ విదేశీయులకు...
- February 15, 2017
న్యూఢిల్లీ : భారత్ లో అడుగుపెట్టే విదేశీయులకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ-వీసాతో భారత్ కు వచ్చే విదేశీయులకు ప్రీ-లోడెడ్ తో కూడిన ఉచిత సిమ్ కార్డులను అందించనున్నట్టు తెలిపింది. బీఎస్ఎన్ఎల్ అందించే ఈ సిమ్ కార్డులో రూ.50 టాక్ టైమ్, 50 ఎంబీ ఇంటర్నెట్ డేటాను ఉచితంగా అదించనుంది. ఈ సర్వీసులను పర్యాటక శాఖామంత్రి మహేష్ శర్మ లాంచ్ చేశారు. తొలుత ఈ సర్వీసులు ఢిల్లీలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అందుబాటులోకి వస్తుండగా.. తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న 15 అంతర్జాతీయ విమానాశ్రయాలకు అందుబాటులోకి తేనున్నారు. ఈ సిమ్ కార్డు 30 రోజులు వాలిడిటీ ఉంటుంది.
24 గంటల పాటు ప్రయాణికులకు హెల్ప్ లైన్ నెంబర్్ను అందుబాటులో ఉంచనుంది. రష్యన్, జర్మన్, జపనీస్ వంటి 12 భాషల్లో ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉండనుంది. ఈ-వీసాతో వచ్చే భారత్ కు వచ్చే ప్రయాణికులకు వెల్ కమ్ కిట్ తో పాటు ఉచిత సిమ్ కార్డులను ఇచ్చేందుకు ఎయిర్ పోర్టులో ఇండియన్ టూరిజం డెవలప్్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటుచేసింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







