భారత్‌లో అమెరికా ఎంపీల పర్యటన...
- February 15, 2017
వాషింగ్టన్ : అమెరికా చట్టసభ ప్రతినిధులు ఈనెల 20 నుంచి 25 వరకు భారత్‌లో పర్యటించనున్నారని వైట్‌హౌస్ పేర్కొంది. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలకు చెందిన 27 మంది ఎంపీలు పర్యటిస్తారని తెలిపింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇలాంటి పర్యటనలు ఉపకరిస్తాయని పేర్కొంది. ఈ విషయాన్ని అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా కూడా ధ్రువీకరించారు.
సర్నా తెలిపిన వివరాల ప్రకారం... అమెరికా ఎంపీలు న్యూఢిల్లీ, హైదరాబాద్, బెంగళూర్ నగరాల్లో ఆరు రోజులపాటు పర్యటించనున్నారు.
ప్రభుత్వ అధికారులు, రాజకీయనేతలు, ఎన్జీవోలతో సమావేశమవుతారు. భారత్‌కు రానున్న ప్రతినిధుల్లో జార్జ్ హోల్డింగ్, జాన్ స్మిత్, డేవ్ ట్రోట్, శీలా జాక్సన్ లీ, హాంక్ జాన్సన్, డెవిడ్ సిసిలిన్, హెన్రీ క్యూలర్ తదితరులున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







