రోగన్‌ జోష్‌...

- February 16, 2017 , by Maagulf
రోగన్‌ జోష్‌...

కావలసినవి: ఒక కేజీ మటన్‌, ఒక కప్పు నెయ్యి, 4 లవంగాలు, మూడు ముప్పావు కప్పుల నీళ్లు, ఉప్పు రెండుంపావు టీ స్పూన్లు, ఒక టేబుల్‌ స్పూను వెల్లుల్లి ముద్ద, 8 యాలకులు, పసుపు 5 టీ స్పూన్లు, వేయించిన ఉల్లిపాయల ముద్ద 2 టేబుల్‌ స్పూన్లు, 4 టీ స్పూన్ల కారం కలిపిన ఒక కప్పు నీళ్లు, అర టీ స్పూను కుంకుమ పువ్వును పొడి చేసి కలిపిన రెండు టేబుల్‌ స్పూన్ల వేడి నీళ్లు, పావు టీ స్పూను మిరియాల పొడి.
ఎలా చేయాలి
బాణలిలో నెయ్యి వేసి వేడి చేయాలి. లవంగాలను చిటపటలాడే వరకు వేగించాలి. తర్వాత కిందికి దించి వాటిపై ఒక టేబుల్‌ స్పూను నీటిని చల్లి మూత పెట్టి పక్కన పెట్టాలి. మాంసాన్ని నీటిలో ఉడికించాలి. పైన పేరుకున్న కొవ్వును ఎప్పటికప్పుడు తీసివేస్తూ నీళ్లు మామూలుగా అయ్యే వరకు ఉడికించాలి. దానికి ఉప్పు వెల్లుల్లి ముద్దను కలపాలి. సగం ఉడికిన తర్వాత మాంసం ముక్కలను బయటకు తీసి చన్నీళ్లతో కడిగి పక్కన పెట్టుకోవాలి. మాంసం ఉడికించిన నీళ్లను వేరే గిన్నెలోకి వడకట్టాలి. ఆ గిన్నెను వేడి చేయాలి. దానిలో యాలకులు, పసుపు, లవంగాలు-నేతి మిశ్రమం, ఉల్లి ముద్దను వేసి బాగా కలపాలి. 10 నిముషాల పాటు ఉడికాక ఈ మిశ్రమంలో మాంసం ముక్కలను, కారం నీళ్లను వేసి సన్నని మంటపై ఉడికించాలి. మాంసం పూర్తిగా ఉడికిన తర్వాత కుంకుమ పువ్వు పొడి కలిపిన నీళ్లు, మిరియాల పొడి కలపాలి. తర్వాత కొద్ది సేపు ఉడికించి కిందికి దించాలి. దీనిని వేడి వేడిగా వడ్డించాలి. హోటళ్లలో తినేవారికి ఇది చాలా ఫేవరెట్‌ డిష్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com