డ్రగ్స్‌ పెడలింగ్‌ కేసులో జీవిత ఖైదు..

- February 17, 2017 , by Maagulf
డ్రగ్స్‌ పెడలింగ్‌ కేసులో జీవిత ఖైదు..

ముగ్గురు పాకిస్తానీ వ్యక్తులకు డ్రగ్స్‌ కేసులో జీవిత ఖైదు ఖరారయ్యింది. 2015 ఏప్రిల్‌9వ తేదీన, బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఓ వ్యక్తి కస్టమ్స్‌ అధికారులకు చిక్కాడు. తనిఖీల్లో ముందుగా అతని వద్ద ఎలాంటి అనుమానిత పదార్థాలూ లభ్యం కాలేదు. అయితే, కస్టమ్స్‌ అధికారులు పలు రకాలుగా ప్రశ్నించి, అతని వద్ద నుంచి సమాచారం రాబట్టారు. పొట్టలో క్యాప్స్యూల్స్‌ రూపంలో డ్రగ్స్‌ని దాచినట్లు అంగీకరించాడు. ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించగా, వారి పొట్టలో డ్రగ్స్‌ ఉన్నట్లు తేలింది. అతని కోసం ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూస్తున్న మరో ఇద్దరు పాకిస్తానీ జాతీయుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిలో ఇద్దరి వద్ద డ్రగ్స్‌ ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు, కేసు రిజిస్టర్‌ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com