ఆన్లైన్ అసభ్యత: వ్యక్తి అరెస్ట్..
- February 17, 2017
అసభ్యకరమైన సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా సర్క్యులేట్ చేస్తూ, చైల్డ్ అబ్యూజ్కి కారణమయిన కేసులో ఓ వ్యక్తిని బహ్రెయిన్‌లో అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ డైరెక్టరేట్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయబడింది. ఇంటర్‌పోల్ హెచ్చరికలతో అలర్ట్ అయిన సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, వ్యూహాత్మకంగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంటర్‌పోల్, ఆన్లైన్లో ఉన్న కంటెంట్‌ని పరిశీలించి, నిందితుడ్ని ట్రేస్ చేసింది. బహ్రెయిన్ నుంచే అసభ్యకరమైన కంటెంట్‌ని అతను స్ప్రెడ్ చేస్తున్నట్లుగా గుర్తించడం జరిగింది. బహ్రెయిన్ నుంచీ, అలాగే విదేశాలనుంచి కూడా నిందితుడు ఈ ఘోరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. నేర నిరూపణ జరిగిన తర్వాత నిందితుడికి రెండేళ్ళ జైలు అలాగే 10000 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించబడుతుంది. చిన్నపిల్లలు ఇంటర్నెట్‌ని వినియోగించేటప్పుడు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని, అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు







