ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కొత్త రైళ్లు..
- February 17, 2017
తెనాలి రూరల్: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం తెనాలి రైల్వే స్టేషనులో ఆయన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం విలేకర్లతో మాట్లాడుతూ ప్రయాణికు ల అవసరాలకు అనుగుణంగా అవకాశం ఉన్నంత వరకు కొత్త రైళ్లు, కోచ్ ల ఏర్పాటుకు కృషి చేస్తున్న ట్లు తెలిపారు.
విజయవాడ-గూడూరు మధ్య మూడో లైను పనులు టెండర్ల ప్రక్రియలో ఉన్నట్లు తెలిపారు. తెనాలి - గుంటూరు మధ్య డబ్లింగ్ పనులు 2018 నాటికి పూర్తి అవుతాయన్నారు. పీపీపీ పద్ధతి లో విజయవాడ, తెనాలి, నెల్లూరు, గూడూరు వం టి స్టేషన్లు ముందుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషనలో ఆధునికీకరణలో భాగంగా మోడల్ ఫుడ్ కోర్టులు, ఎగుమతి, దిగుమతులకు ప్రత్యేక స్థలాలు కేటాయించడం జరుగుతుందన్నా రు.
రైల్వే స్టేషన్లను మోడల్‌గా తీర్చిదిద్ది ప్రజలకు మెరుగైన సేవలందించి తద్వారా రైల్వే రెవెన్యూ పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనం తరం రైల్వే వినియోగదారుల సలహా సంఘం సభ్యుడు శరణు శేషగిరి రాజేంద్ర ప్రసాద్, ది ట్రైన ట్రావెలర్స్ అసోసియేషన, వైకుంఠపురం దేవస్థానం, ఇతర సంస్థలు ఇచ్చిన వినతిపత్రాలు స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమ జీఎంను కలిసి పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను తెనాలి వరకు పొడిగించాలని కోరారు. రైల్వే స్టేషనలో మరో ఫుట్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరారు.
అంతకముందు రైల్వే క్వార్టర్స్ ఆవరణలో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు. రైల్వే వైద్యశాలను పరిశీలించి సిబ్బందికి పలు సూ చనలు చేశారు. వైద్యశాలను పరిశుభ్రంగా ఉంచినందుకు వైద్య సిబ్బందికి, వర్క్ ఇనస్పెక్టర్‌కు రూ.10 వేలు వంతున పారితోషికం అందించారు. అనంతరం రెండో నెంబర్ ప్లాట్ ఫారంపై ఉన్న డిప్యూటీ స్టేషను మాష్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు.
కార్యక్రమంలో విజయవాడ డీఆర్‌ఎం అశోక్‌కుమార్, సీఆర్‌ఎస్ క్రిపాల్, పీసీఐ ఎస్‌ఎన సింగ్, సీఈ ఏకే జీ, హెల్త్ ఇనస్పెక్టర్ నరేష్ మీనా, వర్క్ ఇనస్పెక్టర్ సత్తిరాజు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. తొలుత స్టేషన మేనేజర్ సతీష్‌కుమార్, కమర్షియల్ ఇనస్పెక్టర్ శ్యాంబాబు జీఎంకు స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









