గందరగోళం తమిళనాడు అసెంబ్లీలో..

- February 17, 2017 , by Maagulf
గందరగోళం తమిళనాడు అసెంబ్లీలో..

చెన్నై: ఎన్నో మలుపులు .. నాటకీయ పరిణామాల మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అసెంబ్లీలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ ప్రారంభం కాగానే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వానికి మాట్లాడే అవకాశం కల్పించాలని డీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. డీఎంకేకు వ్యతిరేకంగా అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. గందరగోళం మధ్య ఓటింగ్‌ నిర్వహించేందుకు కొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో పన్నీర్‌సెల్వం వర్గం చీఫ్‌విప్‌గా సెమ్మలైన్‌ను మధుసూదన్‌ నియమించారు. బలపరీక్ష మరో రోజు నిర్వహించాలి 
అసెంబ్లీలో డీఎంకే నేత స్టాలిన్‌ మాట్లాడుతూ...
‘‘విశ్వాస పరీక్ష నిర్వహించేందుకు గవర్నర్‌ 15 రోజుల సమయం ఇచ్చారు. తొందర ఎందుకు. బలపరీక్ష మరో నిర్వహించాలి.రహస్య ఓటింగ్‌ ద్వారానే ప్రజాస్వామ్యం వర్థిల్లితుంది. ఎమ్మెల్యేలను రిసార్ట్‌లో ఎందుకు దాచాల్సి వచ్చిందో స్పష్టం చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com