సవరించాలి హెచ్-1బీ వీసా నిబంధనలను
- February 17, 2017
- రిపబ్లికన్ సెనెటర్ ఆరిన్ హ్యాచ్
వాషింగ్టన్ : హెచ్-1బీ వీసా నిబంధనల్లో సవరణలు చేపట్టాల్సిన అవసరముందని రిపబ్లికన్ సెనెటర్ ఆరిన్ హ్యాచ్ అభిప్రాయపడ్డారు. అమెరికాలో వచ్చే ఏడాది చివరి నాటికి 2లక్షల 20వేల మంది ఐటీ నిపుణుల కొరత ఏర్పడే ప్రమాదముందని చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ రంగాల్లో ఉద్యోగుల కొరత ఏర్పడవచ్చునని పలు పరిశోధనా సంస్థలు నివేదించాయని అన్నారు. కాగా, విదేశీ వలసలకు అడ్డుకట్టవేయాలని అధ్యక్షుడు ట్రంప్ వడివడిగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. స్థానిక ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యం కల్పించేలా చర్యలు చేపడుతున్నారు.
అమెరికాలో వర్క్ వీసాలు పొందిన ఉద్యోగులను కూడా బయటకు పంపించేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు. ఇటీవల ఏడు ముస్లిం దేశాలకు చెందిన వలసదారులను మూడు నెలలపాటు అమెరికాలో నిషేధించారు. సిరియా శరణార్థులను నాలుగు నెలల పాటు నిషేధించారు. అమెరికాలో పనిచేస్తున్న ఐటీ నిపుణులు స్వదేశాలకు వెళ్లిపోవడం ప్రారంభమైతే యూఎస్‌లో ఐటీ ఉద్యోగుల కొరత తథ్యమని హ్యాచ్ అన్నారు.
హెచ్1-బీ వీసా నిబంధనల్లో సవరణలు చేపట్టినట్టయితే విదేశీ ఐటీ నిపుణులకు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుంటుందన్నారు. కాగా, హ్యాచ్ అభిప్రాయాలను సమర్థిస్తున్నట్టు సెనెట్ రిపబ్లికన్ హైటెక్ టాస్క్ ఫోర్స్ చైర్మెన్ డాక్టర్ హచ్ తెలిపారు. మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా హెచ్-1బీ వీసా నిబంధనల్లో మార్పులు చేపట్టాలని కోరారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







