కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు అమెరికాలో
- February 18, 2017
వాషింగ్టన్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు వేడుకలను అమెరికాలోని ఎన్ఆర్ఐ విద్యార్థులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని అయోవా రాష్ట్రం డెస్ మోయినెస్ నగరంలో ఎన్ఆర్ఐ విద్యార్థులు కేసీఆర్ 63వ జన్మదినోత్సవాన్ని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, సుదీర్ఘకాలం సంతోషంగా జీవితం గడపాలని ఎన్ఆర్ఐ విద్యార్ధులు ఆకాంక్షించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో నవతేజ, ప్రదీప్ చంద్ర, రవి, సంతోష్, రాధాక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







