ఇప్పుడు మహేష్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కోసమే...ఏకంగా 35 లక్షలు ఖర్చు చేస్తున్నారట
- February 18, 2017
సాధారణంగా సినిమా బడ్జెట్ ఇంత.. ఇక ఫైట్ కోసం, సాంగ్స్ కోసం ఇంత ఖర్చు చేస్తున్నాం అని చిత్ర యూనిట్ ప్రకటిస్తారు. సినిమాపై హైప్స్ పెంచుతారు మూవీ మేకర్స్. కానీ ఇప్పుడు మహేష్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కోసమే...ఏకంగా 35 లక్షలు ఖర్చు చేస్తున్నారట. టాలీవుడ్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. వివరాల్లోకి వెళ్తే....
సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రేజీ డైరెక్టర్ మురుగదాస్ కాంబోలో దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమా తెరకెక్కుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంభవామి అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అలాగే మహేష్ ఇందులో పోలీస్ అని కొందరు, లాయర్ అని మరికొందరు అంటున్నారు. కానీ ఈ విషయాల్లో ఇంత వరకు క్లారిటీ లేదు. మహేష్, మురుగదాస్ కాంబోలో సినిమా మొదలై ఆరు నెలలు అయ్యింది. కానీ ఇంత వరకు ఒక్క న్యూసే కాదు, ఒక్క స్టిల్ కూడా రాలేదు. కానీ త్వరలోనే ఫస్ట్ లుక్ టీజర్ ని రిలీజ్ చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ సినిమా టీజర్ లండన్ లో రెడీ అవుతుందట. అందుకోసం ఏఖంగా 35 లక్షలు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. 30 సెకన్లు మాత్రమే ఉండే టీజర్ కి 35 లక్షలు ఖర్చు పెట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ మురుగదాస్ మాత్రం డిఫరెంట్. ఆడియన్స్ లో అంచనాలు పెంచడానికి కాకుండా, ఒక థీమ్ ప్రకారం టీజర్ ని కట్ చేస్తాడు. అది సినిమాపై చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది కూడా. అందుకే మురుగదాస్ టీజర్ కోసం ఇంత ఖర్చు చేస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే మహేష్ మురుగదాస్ మూవీ టీజర్ రాబోతుంది... సినిమా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







