'హిందూ వివాహ బిల్లు'కు పాక్‌లో ఆమోదం

'హిందూ వివాహ బిల్లు'కు పాక్‌లో ఆమోదం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ‘హిందూ వివాహ బిల్లు 2017’ను అక్కడి సెనేట్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. హిందువులకు సంబంధించి ఇదే తొలి వ్యక్తిగత చట్టం. ఈ బిల్లు చట్ట రూపం దాల్చేందుకు పాక్‌ అధ్యక్షుడు సంతకం చేయాల్సి ఉంది. ఇందులో హిందువుల వివాహం, వివాహా రిజిస్ట్రేషన్లు, విడాకులు, తిరిగి వివాహం చేసుకోవడం తదితర అంశాలు ఉంటాయి. దీని ప్రకారం స్త్రీ, పురుషుల వివాహ వయస్సు 18 సంవత్సరాలు.
ఈ బిల్లుతో అక్కడి హిందూ మహిళలకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. వారి వివాహానికి సంబంధించి ధ్రువీకరణ పత్రం తీసుకునే వీలు ఏర్పడుతుంది.
పాక్‌లో హిందువులు ఎక్కువగా ఉన్న పంజాబ్‌, బలోచిస్థాన్‌, ఖైబర్‌ఫంక్తువా ప్రాంతాల్లో దీన్ని అమలు చేయనున్నారు. సింధ్‌ ప్రావిన్స్‌లో ఇప్పటికే సొంత హిందూ వివాహ చట్టం అమలులో ఉంది. ఈ బిల్లును పాక్‌ న్యాయశాఖ మంత్రి జహిద్‌ హమీద్‌ సభలో ప్రవేశపెట్టారు. సభలోని హిందూ సభ్యుడు రమేశ్‌ కుమార్‌ వాంఖ్వానీ మూడేళ్లుగా ఈ బిల్లు ఆమోదం కోసం కృషిచేశారు.

Back to Top