పసిడి ధర పరుగులు పెడుతూ పోతోంది

పసిడి ధర పరుగులు పెడుతూ పోతోంది

ముంబై: పసిడి ధర పరుగులు పెడుతూ పోతోంది. బంగారం ధరలో మూడు వారాలుగా తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా ఈరోజు పది గ్రాములకు రూ.155 పెరిగి రూ.29,880కు చేరుకుంది. స్థానిక బంగారు వర్తకుల నుంచి డిమాండ్ పెరగడంతో ధర పెరిగినట్టు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. వెండి కూడా కిలోకు రూ.400 పెరిగి రూ.43,450 వద్ద ఆగింది. ఇండ్రస్ట్రియల్ యూనిట్లు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగినట్టు తెలుస్తోంది. ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.29,950 కాగా 99.5 స్వచ్ఛత కలిగిన పసిడి ధర పది గ్రాములకు రూ.29,800 పలుకుతోంది.

Back to Top