యుఏఈలోని బంగ్లాదేశీ కార్మికుడి నిజాయితీ

- February 18, 2017 , by Maagulf
యుఏఈలోని బంగ్లాదేశీ కార్మికుడి నిజాయితీ

యుఏఈలో బంగ్లాదేశీ కార్మికుడు జహిర్‌ రెహ్మాన్‌, తనకు దొరికిన వాలెట్‌ని తనతోపాటు తీసుకెళ్ళిపోకుండా, అది పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగిచ్చి నిజాయితీని చాటుకున్నాడు. వివరాల్లోకి వెళితే, 42 ఏళ్ళ జహిర్‌ రెహమ్మాన్‌, నెలవారీగా 700 దిర్హామ్‌లు జీతానికి పనిచేస్తుంటాడు. పార్క్‌లోని ఓ బెంచ్‌పై అతనికి ఓ వాలెట్‌ కన్పించింది. అయితే దాన్ని అతను తీసుకుని, గంట సమయానికి పైగా ఎదురుచూశాడు ఎవరైనా దాని కోసం వస్తారేమోనని. అంతలో ఓ వ్యక్తి కంగారు పడుతూ ఆ వాలెట్‌ కోసం వచ్చాడు. జర్మనీకి చెందిన ఆండ్రియాస్‌ క్రాస్‌, ఆ వాలెట్‌ని పోగొట్టుకున్న వ్యక్తి. ఆండ్రియాస్‌ రాగానే, వివరాలు తెలుసుకుని రెహ్మాన్‌ అతనికి ఆ వ్యాలెట్‌ని ఇచ్చేశాడు. నేను కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించుకోగలను, వేరొకరి సొమ్ము కోసం ఆశపడనని ఈ సందర్భంగా రెహ్మాన్‌ చెప్పాడు. యూఏఈలో 15 ఏళ్ళుగా పనిచేస్తున్నాడాయన. ఈ సంఘటనను తాను ఎప్పటికీ మర్చిపోలేనని తన విలువైన డాక్యుమెంట్స్‌, కొంత నగదు, డెబిట్‌ కార్డ్స్‌, హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ ఇవన్నీ ఆ వ్యాలెట్‌లోనే ఉన్నాయని, రెహ్మాన్‌ రియల్‌ హీరో అని వాలెట్‌ సొంతదారు ఆండ్రియాస్‌ చెప్పారు. తన వ్యాలెట్‌ని తనకిచ్చినందుకుగాను ఆండ్రియాస్‌, రెహమాన్‌కి ప్రోత్సాహకం అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com