రషీద్ బిన్ మొహమ్మద్ మృతికి సంతాపం ప్రకటించిన యూ. ఏ. ఈ., అధ్యక్షులు
- September 19, 2015
రాజకుమారుడు షేక్ రషీద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ మృతికి యూ. ఏ. ఈ., అధ్యక్షులు - హిజ్ హైనెస్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన సంతాపం వ్యక్తం చేశారు. కుమారుని మృతికి దుబాయ్ పరిపాలకులు, యూ. ఏ. ఈ., ఉపాధ్యక్షులు మరియు ప్రధాన మంత్రి హిజ్ హైనెస్ షేక్ మోహమ్మెడ్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కు తమ హృదయ పూర్వక సానుభూతిని తెలియజేశారు. గతించిన రాజకుమారుడు స్వర్గస్తుడవ్వాలని, అతని తల్లిదండ్రులకు ఆ అల్లా ఉపశమనాన్నివ్వాలని ప్రార్ధించారు.
అబుధాబీ యువరాజు మరియు యూ. ఏ. ఈ., సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ హిజ్ హైనెస్ షేక్ మొహమేద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ , షార్జా పరిపాలకుడు హిజ్ హైనెస్ షేక్ సుల్తాన్ బిన్ మోహమ్మెద్ అల్ కసీమి, ఫూజరీయా పరిపాలకుడు హిజ్ హైనెస్ షేక్ హమాద్ బిన్ మోహమ్మెద్ అల్ షార్కీ, రాస్ అల్‌ఖైమా పరిపాలకుడు, ఉమ్మ్ అల్ కువైన్ అధినేత షేక్ సౌద్ బిన్ రషీద్ అల్ ము'అల్లా, అజ్మాన్ పరిపాలకుడు - హిజ్ హైనెస్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నువైమీ తో సహా అరబ్ దేశాల ప్రముఖులు , వారి దర్బార్లు చిన్న వయసులోనే గతించిన రాజకుమారుని మృతికి తీవ్ర దిగ్భంతిని సంతాపాన్ని ప్రకటిస్తూ మూడు రోజులు సంతాప దినాలుగా పాటిస్తున్నాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







